125. Family Comedy story-29 ( సీతా+ పతి )
అస్త మించు చున్న ఎర్రటి సూర్యుడు కొండ వెనుకకు జారు కుంటున్నాడు. గూటికి చేరే పక్షులు వస్తున్నాయి, పొలాలకు పోయిన పల్లె పడుచులు తిరిగి వస్తున్నారు, కొందరు రోడ్డు మీద పొగను పీలుస్తూ ఇంటికి బయలు దేరుతున్నారు., వెలిగి వెలగని వెలుతురులో వేగముతో నడుపుతున్న వాహనాల మద్య మానవుల ప్రయాణము కడు కష్ట తరమైనది. వ్యాపార నిమిత్తము వాహనాలు పెంచుతున్నారు. రోడ్లు విస్తరణలు చేయుటలేదు. పార్కులు చెరువులు కనుచూపులొ లేకుండా చేస్తున్నారు, దీనికి భాద్యు లెవరు "ప్రజలా " - "ప్రభుత్వమా " అని నాకు ప్రశ్నగ మిగిలి పోయింది…